పిఠాపురం మండలం కందరాడలోని బాలాజీ రైస్ మిల్లులో పనిచేస్తుండగా పుట్టి వెంకటరమణ (36) ప్రమాదవశాత్తు జారిపడడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పసలపూడికి చెందిన వెంకటరమణ శుక్రవారం షెడ్డు నిర్మాణ పని చేస్తుండగా ఈ ఘటన జరిగింది. సంఘటన స్థలానికి గ్రామీణ ఎస్ఐ గుణశేఖర్ మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మీడియాకు తెలిపారు.