పిఠాపురం: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

పిఠాపురం మండలం మల్లాంకు చెందిన పల్లపు సురేష్ బాబు (37) విద్యుదాఘాతంతో బుధవారం రాత్రి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. గ్రామంలో ఓ ఇంటి వద్ద నీటి మోటారుకు కనెక్షన్ ఇస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతడిని పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కుటుంబానికి జీవనాధారమైన సురేష్ బాబు మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్