పిఠాపురం పట్టణంలో పుష్ప-2 సినిమా విడుదలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా పలు థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతుందని ప్రేక్షకులకు తెలిసేలా పట్టణమంతా పోస్టర్లు అతికించారు. బుధవారం రాత్రి పాత బస్టాండు సెంటర్ లో ఓ గోడపై అంటించిన ఈ పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఈ నేపథ్యంలో వాల్ పోస్టర్లు చించివేత వివాదస్పదంగా మారగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.