డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం పిఠాపురం పర్యటనలో భాగంగా కుమారపురంలో కృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన మినీ గోకులని లాంఛనంగా ప్రారంభించారు. అయితే పిఠాపురంలో పవన్ పర్యటనలో తోపులాట జరిగింది. తోపులాటలో జనసేన నేత లక్ష్మికి తలకు గాయమైంది. పోలీసులపై జనసేన వీర మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలో పార్టీలో మహిళలకు గౌరవం దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.