అమ్మమ్మ మందలించిందని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగిన బాలిక కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు యు. కొత్తపల్లి పోలీసులు తెలిపారు. మండలంలోని రమణక్కపేటకు చెందిన పదో తరగతి బాలిక (15)ను తన అమ్మమ్మ పరీక్షల సమయం దగ్గరపడుతోంది, చదువుకోమని మందలించడంతో డిసెంబర్ 19న పురుగు మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై ఎస్ఐ వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.