కోతకు గురైన ఉప్పాడ తీరం

ఏపీపై అర్నబ్ తుపాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి, సముద్రంలో అలలు ఉగ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో సముద్రపు అలల ఉధృతికి తీరం తీవ్రంగా కోతకు గురవుతోంది. రక్షణ కోసం నిర్మించిన రాళ్లగట్టు అలలు తాకిడికి రాళ్లు రోడ్డుపైకి చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕