రాజవరంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

రౌతులపూడి మండలం రాజవరంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వతంత్ర పోరాట వీరుల సేవలను కొనియాడారు. మహనీయులను ఆదర్శంగా తీసుకొని దేశ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్