విద్యుత్ ఘాతంతో లైన్మెన్ మృతి

కాకినాడ జిల్లా ఎర్రవరం గ్రామంలో గురువారం విద్యుత్ ఘాతంతో లైన్మెన్ బిరుసు రాజు (30) అక్కడికక్కడే మృతి చెందాడు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రైవేటు లేఔట్ లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల నిమిత్తం విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఏలేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్