ఏగులమ్మ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ

ప్రత్తిపాడు మండలం పెద శంకర్లపూడి గ్రామదేవత ఏగులమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఆదివారం భూమిపూజ చేశారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భూమిపూజ నిర్వహించి, ప్రత్యేక పూజల అనంతరం ఆలయ నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్