ప్రత్తిపాడు లంపకలోవ రహదారిలో గురువారం ఓ క్వారీ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లాటరైట్ ఖనిజాన్ని తరలించేందుకు వెళుతున్న ఆ లారీ రైతు గౌతు గంగ పొలంలో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. దీనిపై ఫిర్యాదు అందలేదని ప్రత్తిపాడు పోలీసులు తెలిపారు. ఈ రహదారిలో లాటరైట్ ఖనిజాన్ని రవాణా చేసే లారీలే రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే మితిమీరిన వేగంతో వెళుతుండడంతో స్థానికులు భయపడుతున్నారు.