రౌతులపూడి: నిబంధనలు ఉల్లంఘించిన 14 లారీలపై కేసు నమోదు

రౌతులపూడి, శంఖవరం మండలాల్లో గురువారం భారీ వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన 14 లారీలపై కేసులు నమోదు చేసి యజమానులకు రూ.2.4 లక్షల జరిమానా విధించామన్నారు. లోడ్ మితిని అధిగమించడం, భద్రతా నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతో చర్యలు తీసుకున్నామని వివరించారు.

సంబంధిత పోస్ట్