ఏలేశ్వరం మండలం యర్రవరంలోని అవంతి ఫ్యాక్టరీలో మూడు రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ అయింది. ఇందులో 30 మందిపైగా అస్వస్థతకు గురయ్యారు. అయితే యాజమాన్యం బయటికి తెలియకుండా వారిని జగ్గంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తోందని కార్మికులు తెలిపారు. సోమవారం కొందరు వైద్య సిబ్బంది ఫ్యాక్టరీలోకి వెళ్లారని సెక్యూరిటీ తెలియజేశారు. ఈ విషయం గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.