రాజమహేంద్రవరం 21వ వార్డులో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పలువురు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. బుధవారం మాజీ కార్పొరేటర్ ఏ. వి. రమణకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరడం అభినందనీయమని, పార్టీ బలోపేతానికి, ప్రజలకు సేవ చేసేందుకు ఏ. వి. రమణ మరింత క్రియాశీలకంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.