తూర్పుగోదావరి జిల్లాలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడటంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని మంగళవారం విద్యుత్ శాఖ పర్యవేక్షణ అధికారి కె. తిలక్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చు. సిబ్బంది వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపడతారు. ప్రజలు తెగిపడిన విద్యుత్ తీగలు, స్తంభాలకు దూరంగా ఉండాలని, గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. తుఫాను పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరిక జారీ చేశారు.