మన బాధ్యత ఫౌండేషన్ రాజమండ్రి సిటీ అధ్యక్షురాలు గారా శ్రీవిద్య రాణి ఆధ్వర్యంలో రాజమండ్రి సిటీలో ఆదివారం ఏర్పాటు చేసిన సమ్మర్ బ్లడ్ డ్రైవ్ 114వ రోజుకు చేరుకుంది. ఫౌండేషన్ చేస్తున్న సేవా, అవగాహన కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరమని, అందరూ కలిసి వస్తే వేసవిలో రక్త కొరత తగ్గించవచ్చని, ఆరోగ్యంగా ఉన్నవారు రక్తదానం చేయాలని ఆమె సూచించారు.