మన బాధ్యత ఫౌండేషన్ రాజమండ్రి సిటీ అధ్యక్షురాలు గారా శ్రీవిద్య రాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ బ్లడ్ డ్రైవ్ 114వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరమని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తే వేసవిలో రక్త కొరతను తగ్గించవచ్చని, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు.