రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

రాజమహేంద్రవరంలోని ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయం సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలను ఇసుక లారీ ఢీకొట్టడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యకు తీవ్ర గాయాలవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీలో చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕