రాజమండ్రి బెటాలియన్ లో దీక్షాంత పరేడ్ కార్యక్రమం

రాజమహేంద్రవరం 4వ (IR) బెటాలియన్, ఏపీఎస్పీ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ - 2025 బ్యాచ్ దీక్షాంత పరేడ్ శనివారం జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ కూడా హాజరుకానున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్స్ తమ వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు.

సంబంధిత పోస్ట్

✕
✕