జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రిలో జనసేన శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. బుధవారం ఉదయం సిటీ ఇంచార్జ్ అత్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ నుంచి ఏవీ ఏ రోడ్డు పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ ఘనంగా సాగింది. పవన్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక నియంత్రణ చర్యలు చేపట్టారు.