రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ జిల్లా ఇన్చార్జిగా బుద్ధ లక్ష్మీ నారాయణ (నాని) బుధవారం నియమితులయ్యారు. గతంలో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన ఆయన ఈ బాధ్యతలను అప్పగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి. వి. ఎన్. మాధవ్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.