రాజమండ్రిలోని లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవల్ రివ్యూ కమిటీ (డీఎల్ఆర్సీ) సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అర్హులైన రైతులు, స్వయం ఉపాధి పొందేందుకు ఆసక్తి ఉన్న యువత, చిన్న తరహా పరిశ్రమల నిర్వాహకులకు ప్రభుత్వ సబ్సిడీ పథకాలు, బ్యాంకు రుణాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరులో జాప్యం లేకుండా పారదర్శక విధానాలను పాటించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిజమైన అర్హులకు చేరేలా బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలన్నారు