పర్యావరణ సమతుల్యత కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత :4 బెటాలియన్.

పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుదల లక్ష్యంగా రాజమండ్రి 4వ ఐఆర్ బెటాలియన్ ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెటాలియన్ అధికారులు, సిబ్బంది వివిధ రకాల మొక్కలను నాటి వాటి సంరక్షణకు కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. ఇన్‌చార్జ్ కమాండెంట్ ఎస్. దేవానందరావు మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం తమ సామాజిక బాధ్యతన్నారు.

సంబంధిత పోస్ట్