ఎండ ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగర ప్రజలకు కాస్త ఊరట లభించింది. శుక్రవారం ఉదయం నుంచి ఎండ వేడిమితో అల్లాడిపోతున్న ప్రజలకు మధ్యాహ్నం 3 తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులు వల్ల చల్లబడి చల్లటి గాలులు వీచాయి. దీంతో చల్లటి గాలులు, చిరు జల్లులతో ప్రజలు సేద తీరారు. ఒకపక్క రూరల్ గ్రామాలలో ధాన్యం, చేతుకొచ్చిన వరి, మొక్కజొన్న పంటలు తడిసిపోతున్నాయని రైతులు బాధను వ్యక్తం చేస్తున్నారు.