తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి సిటీలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ తరపున జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ అనురాధ, ముఖర్జీ గారి జీవిత సాధన, దేశ సేవ, సమాజంలో ఆయన సేవా కార్యక్రమాలు, దేశ ప్రగతికి ఆయన కృషి గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ రమాదేవి పాల్గొన్నారు.