యువ ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్

తూ. గో జిల్లాలో యువ ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. నూతన ఓటర్ల నమోదు, పోలింగ్ కేంద్రాల పేరు మార్పు, హేతుబద్దీకరణకు చేపడుతున్న చర్యల గురించి ఆయనకు కలెక్టర్ వివరాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్