కాళికాదేవి అమ్మవారి ఆలయంలో పురందేశ్వరి ప్రత్యేక పూజలు.

కోల్కతాలోని కాళీఘాట్లో ఉన్న అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ కాళికా దేవి అమ్మవారి ఆలయాన్ని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగజ్జనని కాళికా మాత అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్

✕
✕