రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వీధి కుక్కలు స్వైరవిహారం.

రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో శుక్రవారం వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. దీంతో రోగులు, వారి బంధువులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి, వీధి కుక్కలను నియంత్రించి భద్రత కల్పించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్