భారత్ వికాస్ పరిషద్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, దార్శనికుడు, సమాజ సేవకు అంకితమైన సూరజ్ ప్రకాష్ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి శాఖల ఆధ్వర్యంలో శనివారం స్థానిక బ్రిమ్మీస్ ఆల్ డే కేఫ్లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సభ్యులు, సమాజాభివృద్ధి, సేవా కార్యక్రమాల పట్ల ఆయన చూపిన మార్గదర్శకత్వం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సూరజ్ ప్రకాష్ సేవలు ధార్శనియమని సభ్యులు కొనియాడారు.