నిత్యవసర ధరల పెంపుపై వైసీపీ వినూత్న నిరసన

రాజమహేంద్రవరం కోటగుమ్మం వద్ద పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను నిరసిస్తూ మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్చార్జి మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో సోమవారం వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. కూరగాయలు, ఉల్లిపాయల దండలను మెడలో వేసుకుని, గ్యాస్ సిలిండర్లను భుజాన మోస్తూ, పెరిగిన నిత్యావసర వస్తువులను బండిపై ఉంచి ప్రధాన రహదారిపై ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలను అడ్డంగా దోచుకుంటోందని విమర్శించారు. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యుడు ఎలా బతకాలని ప్రశ్నించారు. ధరలను తగ్గించే వరకు ప్రజల పక్షాన పోరాడుతారన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕