రాజమండ్రిలో దొంగల హాల్ చల్

రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వి. ఎల్ పురానికి చెందిన కాంతాదేవి ఇంట్లో రూ. 98వేలు నగదు చోరీకి గురైంది. ఈ నెల 3తేదీన ఆమె పడుకున్న అనంతరం ఉదయం లేచి చూసేసరికి పెంట్ హౌస్‌లోని బీరువా తెరిచి ఉంది. దానిలోని దుస్తులు చిందర వందరగా పడేసి ఉన్నాయి. బీరువాలో ఉన్న రూ. 98 వేలు చోరీకి గురైనట్లు గుర్తించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ రమేష్ సోమవారం చెప్పారు.

సంబంధిత పోస్ట్