తాళ్లపూడి ఎస్సీ కాలనీలో అపరిశుభ్రత: అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడిలోని ఎస్సీ ఏరియాలో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిలిచిన నీటి నుంచి దుర్వాసన వస్తుండటంతో విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం ఈ సమస్యపై స్థానిక జూనియర్ అసిస్టెంట్‌ను అడగగా, బ్లీచింగ్ పౌడర్ స్టాక్ లేదని, పై అధికారులకు ఫిర్యాదు చేయమని ఆయన బదులిచ్చారు. దీంతో స్థానిక ఎంపీడీఓ, డిపిఓలు స్పందించి తక్షణమే బ్లీచింగ్ చల్లించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕