కడియంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

మండల కేంద్రమైన కడియం ఆటో స్టాండ్‌ వద్ద బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్థులను విచారించగా అతడి వివరాలు తెలియరాలేదు. కాగా మృతి చెందిన వ్యక్తి ఎరుపురంగు టీషర్ట్, నిక్కరు ధరించి ఉన్నాడు.

సంబంధిత పోస్ట్