గోకవరం మండల కేంద్రం పాత బస్టాండ్ వద్ద ఉన్న దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు, పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ముసరిమిల్లి కాలువ వాటర్ తో జలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళ్ళులు అర్పించారు.