కోరుకొండ: విమానం డోర్ తెరిచిన ప్రయాణికుడిపై కేసు నమోదు

విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ప్రయాణికుడిపై కోరుకొండ పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఎస్ఐ శ్యామ్ సుందర్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం మధురపూడి విమానాశ్రయానికి వచ్చింది. ల్యాండ్ అయిన తరువాత రాజమండ్రికి చెందిన ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. దీంతో విమానం వెళ్లడానికి జాప్యం జరిగింది.

సంబంధిత పోస్ట్