ఈ నెల 4వ తేదీన కోరుకొండ మండలం నిడిగట్ల శివారులో జరిగిన యువకుడి హత్య కేసును చేదించినట్లు డీఎస్పీ శ్రీకాంత్ మంగళవారం వెల్లడించారు. మద్యం మత్తులో ఘర్షణ ప్రారంభమై చివరకు చిన్నబ్బులు అనే యువకుడి ప్రాణం తీసిందన్నారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మిత్రులే హత్య చేసినట్లు చెప్పారు. ఈ మేరకు సాయి, వీరబాబు, ఆకుల గణేశ్, కర్రి శ్రీనివాసరెడ్డి, రేలంగి తరుణ్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు.