రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. రాజనగరం మండలం దివాన్‌చెరువుకు చెందిన ఆకుల గోవిందరావు (50) భార్యతో గొడవపడి శుక్రవారం గడ్డిమందు సేవించాడు. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందాడు. అతని కుమారుడు ఆకుల రమణ ఫిర్యాదుతో బొమ్మూరు పీఎస్ ఎస్ఐ మురళీమోహన్ శనివారం కేసు నమోదు చేశారు.