రాజానగరం పోలీస్ స్టేషన్‌లో 16 ఏళ్ల బాలిక 18 యువకుడిపై బుధవారం ఫిర్యాదు చేసింది. రాజానగరానికి చెందిన మైనర్లు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. బాలుడు పాఠశాలలలో చదువుతున్న రోజుల నుంచి ఆమెను ప్రేమించి మాయ మాటలతో లోబరుచుకున్నాడు. బాలిక పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడంతో ముఖం చాటేశాడు. న్యాయం కోసం బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీఎస్సీ శ్రీకాంత్ పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.