రాజానగరం హైవే గైట్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. బొమ్మూరుకి చెందిన వాకలపూడి వెంకటేశ్వరరావు అతని భార్య రాజేశ్వరి (65)తో కలిసి రాజానగరం మండలం పల్లకడియంలో ఉంటున్న కుమార్తె ఇంటికి స్కూటీపై బయలుదేరారు. దీంతో వెనుక నుంచి వస్తున్న లారీ వారిని ఢీకొనడంతో తలకు బలమైన గాయమై రాజేశ్వరి అక్కడికక్కడే మృతి చెందారు.