ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనుంది. అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజు సాంచి తెలిపారు. ఈ మేరకు అమలాపురం ప్రెస్ క్లబ్లో రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్, జిల్లా కన్వీనర్ మేర్ల శాస్త్రులు మాట్లాడారు.