ద్రాక్షారామ: ప్రేమ పేరుతో బాలికపై వంచన

ద్రాక్షారామ సమీపంలో నివసించే 16 ఏళ్ల బాలికకు బియ్యంపేటకు చెందిన 17 ఏళ్ల బాలుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. ప్రేమ పేరుతో ఆమెను లోబరుచుకుని శారీరక సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో బాలుడు నిరాకరించి ముఖం చాటేశాడు. బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పడంతో, వారి సహకారంతో ద్రాక్షారామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై లక్ష్మణ్ నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్