రామచంద్రపురం పట్టణ కేంద్రం రామచంద్రాపురంలో మంగళవారం మధ్యాహ్నం సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుండి ఎండ కాచినా కానీ మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. దీంతో రహదారులపై వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అకాల వర్షాలు రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో కళ్ళల్లో ధాన్యం తడిచిపోయే అవకాశం ఉందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేసారు.