అమరావతి మహిళలపై ఒక ఛానల్ డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించడంతోపాటు, యాజమాన్యం మహిళా లోకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని రామచంద్రపురం నియోజకవర్గం మహిళా నాయకులు డిమాండ్ చేస్తూ మంగళవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక లైన్స్ క్లబ్ కళ్యాణ మండపం వద్ద ప్రారంభమై మెయిన్ రోడ్డు మీదుగా రాజగోపాల్ సెంటర్ వరకు సాగింది.