అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి తీర్థ మహోత్సవం సందర్భంగా శనివారం చిరంజీవి అభిమానులు అన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్ దిరిశాల బాలాజీ, మెగా అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహోత్సవాలకు వచ్చే భక్తులకు అన్నదానం చేయటం ఆనందంగా ఉందని బాలాజీ పేర్కొన్నారు. ఎంతోమంది దాతలు స్వామివారి ఉత్సవాలకు వచ్చే వారికి ఉచితంగా అన్నదానం చేస్తున్నారన్నారు. సహకారం అందిస్తున్నామని చెప్పారు.