రాజోలు మండలం రాజోలు కాటన్ పార్క్ సమీపంలో పెట్రోల్ బంక్ ఎదురుగానున్న రోడ్డుపై వాటర్ క్యాన్ లతో వెళుతున్న ఆటోను ఒక ప్రవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుండి ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఆటో డ్రైవర్ కు ఎటువంటి గాయాలు కాలేదని, బస్సు ఆపకుండా వెళ్ళిపోయినట్లు స్థానికులు చెప్పారు. ఆటో దెబ్బతినడంతో పాటుగా వాటర్ క్యాన్ లు కూడా డేమేజ్ అయ్యాయన్నారు.