రాజోలు మండలంలో ఉదయాన్నే చల్లని జల్లులు

రాజోలు మండలం వ్యాప్తంగా బుధవారం ఉదయం కురిసిన మోస్తరు వర్షం ప్రజలకు ఉపశమనాన్నిచ్చింది. గత కొన్ని రోజులుగా భానుడి వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజానీకానికి ఈ వర్షం ఊరట కలిగించింది. ఉదయాన్నే వాతావరణం చల్లబడటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రహదారులు జలమయం అయ్యాయి. వేసవి తాపం నుండి ఉపశమనం లభించడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.

సంబంధిత పోస్ట్