రాష్ట్రంలో పింఛన్లను పెంచిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఆ పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్య నిర్వాహక కార్యదర్శి బోళ్ల వెంకటరమణ అన్నారు. రాజోలు మండల కేంద్రం రాజోలులో సోమవారం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంక్షేమం అనేది టీడీపీతోనే ప్రారంభం అయ్యిందని ఆయన చెప్పారు. టీడీపీ సీనియర్ నాయకులు, ఉపసర్పంచ్ పామర్తి రమణ, తదితరులు ఉన్నారు.