రాజోలు నియోజకవర్గం గాడ్స్ లవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేసనపల్లి గ్రామానికి చెందిన నల్లి సూర్య ప్రవల్లిక ల కుమారుడు ఇవాన్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా వారు సమకూర్చిన ఆర్థిక సహాయంతో నగరం గ్రామానికి చెందిన గెడ్డం చిట్టిబాబు హంసమని కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ చేసినట్లు గాడ్స్ లవ్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. పాస్టర్ గుర్రం రాజు, గెడ్డం రాజు, బల్ల పుల్లేశ్వరరావు, చొప్పల సుమంత్ పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.