పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన క్యాన్సర్ బాధితురాలు కర్రి రామలక్ష్మికి గల్ఫ్ శెట్టిబలిజ యువశక్తి సేవా సంస్థ రూ. 40,000 ఆర్థిక సహాయం ఆదివారం అందించింది. కోనసీమ, రాజోలులో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కట్టా భాస్కర్, అకౌంటెంట్ గుబ్బల శ్రీను, సభ్యులు, కవురు ఫౌండేషన్ అధ్యక్షులు కౌరు నరసింహస్వామి, న్యాయవాది కట్టా వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా ఈ సాయం అందజేయబడింది. అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం గొప్ప సేవ అని ఈ సందర్భంగా వై. గో. పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.