సఖినేటిపల్లి మండలం గుడిమూలకు చెందిన దెంతుకూరి రాంబాబురాజు తన తండ్రి సత్యనారాయణ రాజు పేరిట ఉచిత అంబులెన్స్ ఏర్పాటుచేసి పేదలకు సేవలందిస్తున్నారు. డ్రైవర్ ను ఏర్పాటుచేసి ఎంత దూరమైనా ఆ అంబులెన్స్ లో ఉచితంగా ఆసుపత్రులకు రోగులను తరలిస్తూ సేవలను కొనసాగిస్తున్నారు. నెలకు రూ. లక్ష వరకు ఖర్చవుతుందని ఆయన బుధవారం తెలిపారు. ఇప్పటివరకు 2009 మంది రోగులకు అంబులెన్స్ ద్వారా ఉచిత సేవలు అందించామన్నారు.