కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్.. ఓఎన్జీసీ నిర్లక్ష్యంపై స్థానికుల ఆవేదన

అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్ వద్ద పైపు లైన్ నుంచి భారీగా గ్యాస్ లీకవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల డ్రిల్లింగ్ పూర్తి చేసిన తర్వాత ఈ లీక్ జరిగిందని, ఓఎన్జీసీ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గత నెల జనవరి 5న ఇరుసుమండ గ్రామంలోనూ ఇలాంటి గ్యాస్ లీక్ ఘటన జరిగి మంటలు ఎగసిపడ్డాయి.

సంబంధిత పోస్ట్